తమపై మావోయిస్టులకు తప్పుడు సమాచారం

Maoists misinformation about them– మాజీ జెడ్పీటీసీ గొనె శ్రీనివాసరావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల ప్రజలకు తమను దూరం చేయాలనే ఉద్దేశ్యంతోనే కొందరు కావాలనే తమపై మావోయిస్టులకు తమ్ముడు ఇచ్చారని,ఇలాంటిది సరికాదని మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు మావోయిస్టుల ప్రకటనను ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వాస్తవాలు లేవన్నారు. దళిత బందు లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లుగా ప్రకటించడంలో వాస్తవం లేదన్నారు. మండలంలో తమ కుటుంబం గత 30 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూ మూడు పర్యాయాలు మల్లారం సర్పంచ్ గా తాను, తన సతీమణి ఒక దఫాగా మండల జడ్పీటీసీగా, అలాగే పలుమార్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసినట్లుగా తెలిపారు. కానీ ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రజా సేవ చేస్తున్న నేపథ్యంలో  రాజకీయంగా కొందరు ప్రత్యార్థులు చేసిన అపవాదును నమ్మి,మావోలు నిజానిర్దారణ చేయకుండా హెచ్చరిక చేయడం సరైంది కాదన్నారు.ఇప్పటికైనా మావోలు పునరాలోచించాలని కోరారు.