– ప్రవేట్ ఉపాధ్యాయుడు కర్రే వార్ పండరి
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు కర్రేవార్ పండరి గోధుమ రవ్వతో భారతదేశం పటం వేసి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని గోధుమ రవ్వతో చిత్రం ద్వారా ఓటర్లకు వివరించారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వినూత్నంగా చిత్రం గీసిన పండరిని గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.