పత్తా లేని వానలు.. మండుతున్న ఎండలు

– కరెంట్ కోతలు ఎండి పోతున్న పత్తి చేన్లు
– రైతన్న పై భారం
నవతెలంగాణ- చందుర్తి
జులై, ఆగస్టు నెల లో భారీ వర్షాలు పడ్డాయి దింతో జనం,అతలాకుతలం ఐనది మరో వైపుగా పంట చేన్లు కూడా కొట్టుకుపోయినాయి.సెప్టెంబర్ మాసం మొదటి వారం లో చిరు జల్లులు కురిసినాయి. నెల రోజుల నుండి వర్షాల జాడ లేకుండా పోయింది. మండలంలోని పలు గ్రామాల పరిధి లో మూడు వేల హెకర్ల వరకు కాటన్ సాగు వేశారు. యాభై శాతం నల్ల రేగడి యాభై శాతం ఎర్రనేల లో సాగు వేసినట్లుగా ఆంచన..
ఎండి. పోతున్న పత్తి చేన్లు
గత నెల నుండి వర్షాల పత్తా లేకపోవడంతో ఎర్రనేల లో వేసిన కాటన్ వాడిపోతుంది.దింతో తేమ లేక పోవడంతో పూత రాలిపోయి ఉన్న కాయ సైజ్ తగ్గి తొందరగా పత్తి పగిలే ఆవకాశం ఉంది.మరో వైపుగా ఒక పత్తి చేట్టుకు ఇరవై నుండి యాభై వరకు కాయలు ఉంటాయి.అధిక ఎండలు కొట్టడం తో ఐదు నుండి పది కాయలే చేట్టుకు కసినవి దింతో రైతుకు నష్టం వస్తుంది.ఎకరానికి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది ఈ సీజన్లో ఏకరం కు ఐదు క్విటళ్లు రావడం గగణమే అని కాటన్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతన్న పై అదనపు భారం
వర్షాలు లేకపోవడంతో పత్తి పంటను కాపాడుకోవడానికి రైతులు బోరు బావుల పై ఆధారపడి నీటిని సాగు చేస్తున్నారు. మరి కొందరు డ్రిప్ ద్వారా నీటిని పత్తి పంటకు సాగు నీరు అందిస్తున్నారు.అదనంగా రైతులు పైపులు కొనుగోలు చేసి సాగునీటికి ఉపయోగిస్తున్నారు.దింతో ఐదు నుండి పదిహేను ఎకరాల వరకు సాగు చేసిన రైతులు వైపులు కోనుగోలు చేయాలంటే యాభై వేల వరకు అదనపు భారం రైతుల పై పడనుంది.దింతో ఈ సంవత్సరం రైతన్న పరిస్థితి ఆగమ్య గోచరమే అన్నట్లుగా ఉంది
ఓ వైపు ఎండలు. మరో వైవుగా కరెంట్ కోతలు
వేసవి కాలాన్ని తలపించే విదంగా 40 డిగ్రీలు ఎండలు మండుతున్న యి దీనికి తోడుగా కరెంట్ కోతలు కూడా ఉన్నాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రైతులు వ్యవసాయ బావుల వద్ద నిరీక్షణ చేయడం జరుగుతుంది. ఎండల తో పంట చేన్లు వాడు మొఖం వేస్తున్నాయి. నీటిని అందిస్తామని పోతే అప్రకటిత కోతలతో రైతులు సతమతం అవుతున్నారు. ఏది ఏమైనా రైతన్న బతుకు ఎండమావే అన్నట్లుగా ఉంది.