మరకత లింగాన్ని దర్శించుకున్న బుల్లితెర నటి

మరకత లింగాన్ని దర్శించుకున్న బుల్లితెర నటినవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో నెలకొన్న మరకత శివలింగాన్ని సోమవారం బుల్లితెర నటి భార్గవి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మెన్‌ అర్చకులు ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం నుంచి చందిప్ప గ్రామంలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన మరకత శివలింగాన్ని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.తాను టీవీ సీరియల్‌లో అత్తారింటికి దారేది, గృహలక్ష్మి, కృష్ణ ముకుందా మురారి సీరియల్‌ నటిస్తున్నట్టు తెలిపారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ ప్రధాన పూజారి సాయిశివ నటి భార్గవికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆలీ ఇండియా ప్రచార కమిటీ చైర్మెన్‌ దయాకర్‌ రాజు, ఆలయ గౌరవ అధ్యక్షులు సదానందంగౌడ్‌ నటి భార్గవికి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ శేఖర్‌, ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు పాల్గొన్నారు