రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో తెలుగు మీడియం చదువులు మరాఠీ మీడియం టీచర్లు 

– పాఠశాలలకు తెలుగు మీడియం పుస్తకాల సరఫరా మరాఠీ మీడియం టీచర్లతో ఖాళీల భర్తీ

– పిల్లలకు తెలుగు చదువులు కావాలని తల్లిదండ్రుల ఆవేదన వారి కోరిక నెరవేర్చని ప్రభుత్వం

నవతెలంగాణ మద్నూర్

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని మహారాష్ట్రకు పూర్తిగా బార్డర్ లో గల రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో నీ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువులకు గాను మరాఠీ మీడియం పంతులు ఉండటం కొత్తగా టీచర్ల భర్తీలో కూడా మరాఠీ మీడియం టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలకు ఖాళీలను భర్తీ చేసింది మండలంలోని హెచ్ కేలూరు గ్రామంలో ఆ గ్రామ పిల్లల తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల కాలంగా మా పిల్లలకు మరాఠీ చదువులు వద్దు తెలుగు మీడియం చదువులే కావాలంటూ ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం నుండి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ సరిహద్దు గ్రామాల్లో మరాఠీ మీడియం కాకుండా తెలుగు మీడియం చదువులు ప్రారంభించారు తెలుగు చదువులకు గాను మరాఠీ మీడియం పంతులు ఉండటం పిల్లల చదువులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ హెచ్ ఏలూరు గ్రామం నుండి ఆ గ్రామ పిల్లల తల్లిదండ్రులు సంవత్సరాలకు కొద్ది ప్రభుత్వానికి విన్నవిస్తూ తెలుగు మీడియం టీచర్లను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రభుత్వ శాలల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ వస్తుంది. ఈ సరిహద్దు గ్రామాల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తూ వస్తుంది కానీ తెలుగు మీడియం టీచర్లను నియమించకపోవడం పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను భర్తీచేసింది ఈ సరిహద్దు గ్రామాల్లో మళ్లీ మరాఠీ మీడియం ఉపాధ్యాయులనే భర్తీ చేయడం పాఠశాలల్లో తెలుగు పుస్తకాల సరఫరా మరాఠీ మీడియం టీచర్ల భర్తీ కావడంతో మా పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారుతోందని హెచ్ కేలూర్ గ్రామ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతుంది      మరాఠీ మీడియంలో మార్చి తెలుగు మీడియం చదువులు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పిల్లలకు చదువులు అందించేందుకు తెలుగు మీడియం టీచర్లను నియమించకుండా మరాఠీ మీడియం టీచర్లను భర్తీ చేయడం పిల్లలకు తెలుగు చదువులు పూర్తిస్థాయిలో అందలేకపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతుంది మండలంలోని పలు పాఠశాలల్లో తెలుగు మీడియం పుస్తకాలు మరాఠీ మీడియం పంతులు అనేది పిల్లల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రభుత్వం ఈ పాఠశాలలను మరాఠీ మీడియం పాఠశాలలుగానే గుర్తిస్తుందని తెలుగు మీడియం కావాలంటూ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రతి సంవత్సరం తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం మరాఠీ మీడియం టీచర్లతోనే చదువులు చెప్పించడం ఈ మారుమూల మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారుతుంది తెలుగు మీడియం టీచర్లు లేక ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కానీ తెలుగు మీడియం టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఈ సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది పిల్లల వద్ద తెలుగు పుస్తకాలు పాఠాలు నేర్పేది మరాఠీ పంతులు టీచర్లకు తెలుగు రాదు పిల్లలకు మరాఠి రాదు ఈ విధంగా సరిహద్దు గ్రామాల్లో విద్యా బోధన కొనసాగే తీరు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం టీచర్లను నియమించి పిల్లల చదువులు బాగుపడేలా చూడాలని తల్లిదండ్రులు ఆవేదం వ్యక్తం అవుతుంది