టీఆర్టీఎఫ్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఆర్టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రదాన కార్యదర్శి కావలి అశోక్‌ కుమార్‌ ఈ నెల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆదివారం ఈ పదవికి ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా మానేటి ప్రతాప్‌ రెడ్డి, లక్కిరెడ్డి సంజీవరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌ కుమార్‌ ఈ నెల ఉద్యోగ విరమణ చేయనున్నారు.ఈ సందర్భంగా మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏకగ్రీవంగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి అశోక్‌ కుమార్‌, ద్రాక్షపు విష్ణుమూర్తి, కటకం రవికుమార్‌, సుంకిశీల ప్రభాకర్‌ రావు, విష్ణుమూర్తి, రాష్ట్ర సబ్‌ కమిటీ సభ్యులు, 33 జిల్లాల నుండి రాష్ట్ర కౌన్సిలర్సు హాజరయ్యారు.