నవతెలంగాణ – గీసుకొండ
గొర్రేకుంట క్రాస్ వద్ద తనీఖీలో భాగంగా నాలుగు కిలోల గంజాయిని గీసుకొండ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కథనం ప్రకారం.. వరంగల్ మహానగర పరిధిలోని 16 డివిజన్ గొర్రెకుంట క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. నాగుల విజయ్ కీర్తినగర్ చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా తెల్లటి ప్లాస్టిక్ బ్యాగు పట్టుకొని వెళ్లడం గమనించి ఎస్సై కుమార్ ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద నాలుగు కిలోల గంజాయి దొరికిందని, దాదాపు రూ.1లక్ష విలువ వుంటుందని, గంజాయి విక్రయదారునిపై కేసు నమోదు చేశామని సీఐ ఏ మహేందర్ తెలిపారు.