ఉరి వేసుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్మహత్య

నవతెలంగాణ – భిక్కనూర్
ఉరివేసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంతు రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అంతంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం అప్పుల బాధ భరించలేక, జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని కుటుంబీకులకు చెప్పి వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వ్యవసాయ బావి వద్ద వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విషయం తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి భగవంతు రెడ్డి ని చూసి కన్నీటి పర్వతమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ స్వగ్రామానికి చేరుకొని అంతక్రియలు పాల్గొన్నారు.