నవతెలంగాణ – భువనగిరి
వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌడాను కిరాయి నుండి మినహయింపు ఇవ్వాలని కోరుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో వారు మాట్లాడారు. ప్రభుత్వానికి కష్టం మిల్లింగ్, ధాన్యము నిలువ మిల్లింగ్ చేయుటకు రైస్ మిల్లర్లు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ దాన్యం నిల్వ చేయుటకు మావద్ద తగిన స్థలము లేకపోవుట వలన మేము ప్రభుత్వం వారి అనుమతితో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములను కిరాయకు తీసుకొని అట్టి గోదాముల్లో దాన్యం నిల్వ చేసుకుంటున్నామని తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ దాన్యం అధికముగా రావడం వలన దాన్యం మిల్లింగ్ చేసి బియ్యం ఎగుమతి చేయడములో కొంత జాప్యం కారణంగా దాన్యం గోదాముల్లో ఎక్కువ కాలము నిల్వ చేయవలసి వస్తుందని తెలిపారు. తద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు కిరాయి నిమిత్తం నోటీసులు జారీ చేయుచున్నారు. మేము అట్టి గోదాములను కేవలం కస్టమ్ మిల్లింగ్ దాన్యం మాత్రమే నిల్వ చేయుటకు మాత్రమే వినియోగిస్తున్నామని ఇతర విషయాలకు వినియోగించడం లేదని తెలిపారు. మాకు గతములో కస్టమ్ మిల్లింగ్ దాన్యం నిల్వ చేయుటకు 2019-20 వరకు గోదాముల యొక్క కిరాయలు మినహాయింపు ఇచ్చారని తెలిపారు. తములో మాదిరిగా మాకు 2021 నుండి ఇప్పటి వరకు కస్టమ్ మిల్లింగ్ దాన్యం నిల్వ చేసినందుకు గాను వ్యవసాయ మార్కెట్ కమిటి గోడౌన్ల కిరాయిలు మినహాయింపు ఇవ్వగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మార్త వెంకటేశం,గౌరవ అధ్యక్షులు పసుపునూరి నాగభూషణం, ఉపాధ్యక్షులు జిల్లా వెంకటరమణ, నూనె వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.