కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అఖిలేష్ కలారు నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ సినిమాలో హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ‘టీజర్’ని’ శ్రీ విష్ణు విడుదల చేశారు. ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీగా ఉంది. హీరో, హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నాను.’ అని శ్రీవిష్ణు అన్నారు.