మార్కెట్‌ లో వాటా పెంచుకోవాలి

– బీఎస్‌ఎన్‌ఎల్‌ బిజినెస్‌ మీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టెలికాం మార్కెట్‌లో వాటా పెంచుకోవడంతో పాటు మేకింగ్‌ డిజిటల్‌ ఇండియాలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ నుంచి బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మీటింగ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ వివేక్‌ బంజల్‌ ప్రారంభించారు. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ భారత్‌ నెట్‌, 4 జీ సేవలను వినియోగదారులకు అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ భాగస్వాములకు నిర్దేశించిన సమయంలోపు చెల్లింపులు జరపాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ సర్కిల్‌ సీజీఎం పి.జీ.నిర్మల్‌, హైదరాబాద్‌ పీజీఎం ఎం.చంద్రశేఖర్‌ తో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ నుంచి 50 మంది భాగస్వాములు పాల్గొన్నారు.