హైదరాబాద్ : జాతీయ మాస్టర్స్ గేమ్స్‌లో వెటరన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి మూడు పతకాలు సాధించాడు. గుజరాత్‌లోని ఆనంద్‌లో జరుగుతున్న పోటీల్లో స్విమ్మింగ్ 100 మీ ఫ్రీస్టయిల్, 100 మీ బ్రెస్ట్‌స్ట్రోక్, 50మీ బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్రి లక్ష్మణ్‌రెడ్డి బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. మూడు స్వర్ణాలు సాధించిన లక్ష్మణ్‌రెడ్డిని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు.