దాతల సహకారంతో నిరుపేద వధువు వివాహం

నవతెలంగాణ-దౌల్తాబాద్:పూట పూటకు రెక్కల కష్టం చేసుకుంటూ బతుకులు వెళ్ళతీస్తున్న దీనస్థితిలో కూతురు వివాహం చేయలేని కడుపేదరికంతో కొట్టుమిట్టాడుతూ మా కూతురు వివాహనికి సహకారం అందించాలని ఎస్ఆర్  ఫౌండేషన్ ను సంప్రదించగా దాతల సహకారంతో యువతి వివాహం చేయడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఆదివారం దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో దాతల సహకారంతో నిరుపేద యువతి వివాహం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొమ్మట గ్రామానికి చెందిన దూదేకుల హమీద్ పేదరికంతో పోట్టకూటికోసం కోసం చిన్న పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హమీద్ కిడ్నీ సమస్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కూతురు వివాహం చేయడం తలకు మించిన భారంగా ఉందని నాలుగు రోజుల క్రితం నా కూతురు వివాహానికి మీరే పెద్ద ఎత్తున సహకారం అందించాలని యువతీ తల్లిదండ్రులు ఎస్ఆర్ ఫౌండేషన్ ను సంప్రదించడం జరిగిందని, వెంటనే స్పందించి హమీద్ కూతురు సానియా బేగం వివాహం చేసే బాధ్యత తీసుకొని కొంతమంది దాతల సహకారంతో యువతి వివాహం చేయడం జరిగిందన్నారు. యువతి వివాహానికి 1992-1993 పదవ తరగతి రాయపోల్ బ్యాచ్, నింగి నేల మేము సైతం ఆర్గనైజేషన్ సహకారంతో ఓయూ జెఎసి చైర్మన్, ప్రజా కళాకారులు దరువు అంజన్న 41 వేల రూపాయలు, గజ్వేల్ ఏఎంసీ డైరెక్టర్ మతిన్ బెడ్ మంచం, ఫర్నిచర్, దుబ్బాక నియోజకవర్గం కో ఆప్షన్ సభ్యులు 15 వేలు,1.5 క్వింటాళ్ల బియ్యం, ఆర్టీసీ కండక్టర్ జయేందర్ రెడ్డి 5 వేలు, గజ్వేల్ సదర్ యూసుఫ్ 5 వేలు, మంకిడి నాగరాజు,నవీన్ టేబుల్ ఫ్యాన్, పంజాల వెంకట్ గౌడ్, ఉమర్, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు, దాతల ఆర్థిక సహాయంతో సానియా వివాహం చేయడం జరిగిందన్నారు. మేము సంప్రదించగానే నిరుపేద యువత వివాహానికి సహకారం అందించిన మానవతావాదులకు పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట కోఆప్షన్ సభ్యులు ఖాలీమొద్దీన్, ఎస్ఆఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, మిరుదొడ్డి కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ హైమద్, దౌల్తాబాద్ కో ఆప్షన్ సభ్యులు హైమద్, మంకిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.