నవతెలంగాణ – అశ్వారావుపేట
భార్యాభర్తలు వివాదాలు నేపధ్యంలో వివాహితుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఒకటి మండలంలో చోటు చేసుకుంది. మృతుడు కుంజా నాగరాజు(25) తల్లి ఈశ్వరమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ కథనం ప్రకారం వివరాలు. మండలంలోని ఊట్లపల్లి కి చెందిన కుంజ నాగరాజు కి వెంకట లక్ష్మికి మూడేళ్ళ క్రితం వివాహం అయింది.అనంతరం కొంత కాలానికి వీరి ఇరువురికి కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి.ఈ క్రమం వెంకట లక్ష్మి భర్త నాగ రాజు ను విడిచి వెళ్ళింది.దీంతో నాగరాజు కొన్ని రోజులు గా ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో గురువారం పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.