నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రానికి చెందిన ఎర్ర కావ్య బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు గురువారం ఉదయం నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన కావ్యతో ఏడాదిన్నర క్రితం మండల కేంద్రానికి చెందిన మనోజ్ కు వివాహం కాగా మనోజ్ అక్రమ సంబంధం కారణంగా ఎప్పుడు గొడవలు జరిగేవని రెండు మూడు సార్లు పెద్దమనుషులతో మాట్లాడిన మనోజ్ తీరు మారకపోవడం, భర్త కుటుంబానికి అప్పులు కావడంతో వరకట్న వేధింపుల కారణంగా కావ్య బుధవారం రాత్రి మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కావ్య తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త మనోజ్, మామ మహేష్, అత్త అరుణ లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఆయన వెంట తహసిల్దార్ వీర్ సింగ్, సిఐ లు రాజారెడ్డి ఉన్నారు.