
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నివసిస్తున్న పడకల్ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ కూతురు ఆస్త్ర (28) అనే వివాహిత గుండెపోటుతో మృతి చెందాగా శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించినారు. కాగా జిల్లా కేంద్రంలోని అర్సపల్లికి చెందిన సులేమాన్ అలీ ఖాన్ తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరగగా, తన కూతురిని అల్లుడు వేధిస్తున్నాడని జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్ లో గురువారం తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినారు. కాగా సాయంత్రమే ప్రైవేటు ఆసుపత్రికి తరలించే లోపు గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లయిన నాటి నుంచి అల్లుడు తన కూతుర్ని వేధిస్తున్నాడని భర్త వేధింపులతోనే మానసికంగా కృంగిపోయి గుండెపోటు వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన ఆస్ట్ర కు ఇటీవల అమ్మాయి జన్మించింది.