– పరిశీలించిన మంత్రి వేములు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. అదే విధంగా నిమ్స్ శంకుస్ధాపన ఏర్పాట్లను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పనులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు.