అమరవీరుల త్యాగాలు మరువలేనివి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ –  తుంగతుర్తి
పోరాటాల పురిటి గడ్డ మహనీయులకు జన్మనిచ్చిన కరివిరాల కొత్తగూడెం ముద్దుబిడ్డ వర్దెళ్లి రాములు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారంమండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు వర్దెళ్లి రాములు సంతాప సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ నాడు ఈ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్తగూడెం గ్రామం నిర్వహించిన పాత్రమరవలేనిది అన్నారు. ఈ గ్రామంలో భీమిరెడ్డి రెడ్డి నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం,మారోజు వీరన్న,భీమ్ రెడ్డి కుశలవ రెడ్డి,వర్దెళ్లి బుచ్చిరాములు లాంటి మహా నాయకులకు జన్మనిచ్చింది. కొత్తగూడెం గ్రామం అన్నారు.నేటికీ ఆ పోరాటగుర్తులు చరిత్ర ఏ చెట్టును అడిగిన పుట్టను అడిగిన అమరవీరుల పోరాటాలు, త్యాగాలుగుర్తుకొస్తాయన్నారు.కొత్తగూడెం గ్రామంలో పార్టీని రక్షించడంలో వర్దెళ్లి రాములు నిర్వహించిన పాత్ర మరువలేనిది అన్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చిన కడవరకు ఎర్రజెండాలు భుజాన వేసుకొని గ్రామంలోరైతు,కూలీలహక్కుల కోసం అనేక ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. శత్రువులకు లొంగకుండా దాడులు చేసిన ఏమాత్రం భయపడకుండా కార్యకర్తలను కాపాడిన నాయకులు వర్దెళ్లి రాములు అన్నారు.అమరవీరులు చేసిన త్యాగాలను,బలిదానాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సిపిఎం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం మండల కార్యదర్శిబుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు  కందాల శంకర్ రెడ్డి,పులుసు సత్యం, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,ఎల్గూరి గోవింద్,సీనియర్ న్యాయవాది మల్లు కపోతం రెడ్డి,నల్లకుంట్ల అయోధ్య,మాజీ జడ్పిటిసిలు మూరగుండ్ల లక్ష్మయ్య, తాటి విజయమ్మ,మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం,కన్నె వీరయ్య,డేగల జనార్ధన్,అబ్బగాని బిక్షం,మడ్డి అంజిబాబు,కిషన్ రావు, ముత్తయ్య,పళ్ళ సుదర్శన్,విష్ణుమూర్తి,బండమీద ఎల్లయ్య,గుడిపాటి మల్లయ్య,సోమయ్య,దేవరకొండ యాదగిరి,వర్దెళ్లి రాములు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.