మారుతీ ఇన్విక్టో బుకింగ్స్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ప్రీమియం ఎస్‌యూ ఇన్విక్టోను జులై 5న ఇది మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీనికి ముందే నెక్సా షోరూంలలో, ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది. రూ.25,000 చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చని మారుతి సుజుకి వెల్లడించింది. 2.0-లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ విత్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ టెక్నలాజీ, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ తదితర ఫీచర్లతో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.20 లక్షలకు దిగువన ఉండొచ్చని తెలుస్తోంది.