ప్రతి మహిళా సంఘ సభ్యురాలిని లక్షాధికారిని చేయాలి: మారుతి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

ప్రతి మహిళ సంఘ సభ్యులను లక్షాధికరులు చేయాలని ఐకెపిడీపీ ఎం మారుతి అన్నారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిజాంబాద్ ఆధ్వర్యంలో మండలంలోని వివోఏలకు లక్పతి  ది ధి అంశం పైన రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎం మారుతి మాట్లాడుతూ ఒక కుటుంబము ఇతర అనుబంధ జీవనోపాదుల గురించి ఆలోచిస్తూ అదనపు ఆదాయాన్ని పెంచుకుంటూ అవసరాలను తీర్చుకునే విధంగా మహిళలను తయారు చేయాలన్నారు. కుటుంబంలో పిల్లల చదువు జీవన ప్రమాణాలు ఆర్థిక రక్షణ ఆరోగ్యము అవసరాలకు సరిపడా ఆదాయము పెంచుకునే విధంగా మహిళలకు సహకారము అందించాలన్నారు. పెరిగిన ఆదాయాలతో ప్రతి మహిళను లక్పతి ది ద్వారా ఒక లక్ష రూపాయల జీవనోపాధి పటిష్ట పరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి మహిళకు పశుపోషణ వ్యవసాయ , వ్యాపారాలు, కమ్యూనికేషన్ సమస్య పరిష్కారానికి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలో మహిళలను చైతన్య పరచాలన్నారు. ప్రతి మహిళకు ప్రతినెల పదివేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా మహిళలను ప్రోత్సహిస్తూ వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీల గురించి తెలియజేస్తూ వారిని లక్ష అధికారులను చేయాలని సూచించారు. ప్రతి గ్రామ సంఘం నుంచి మొదటగా 80 మంది మహిళలను లక్ష అధికారులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపియం రవి మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్ రెడ్డి. డి ఎం జి జనార్ధన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మండల సమైక్య సిబ్బంది అన్ని గ్రామాల నుంచి వచ్చిన వివోఏలు తదితరులు పాల్గొన్నారు.