మారుతి సుజుకి బలెనో రెగల్‌ ఎడిషన్‌ విడుదల

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్తగా బలెనో రెగల్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్‌, సీఎన్‌జీలో ఇది లభ్యం కానుంది. ఇందులో నాలుగు వేరియంట్లు ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది. బలెనో మోడల్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కుటుంబాలను చేరువ అయినట్టు మారుతి సుజుకి ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పర్థో బెనర్జీ తెలిపారు.