మారుతి సుజుకి కొత్త డిజైర్‌ విడుదల

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త డిజైర్‌ 2024ను విడుదల చేసింది. నాలుగోతరం డిజైన్‌తో పాటు ఫీచర్లు, ఇంజిన్‌లోనూ పలు మార్పులు చేసినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ప్రారంభ ధరను రూ.6.79 లక్షలుగా నిర్ణయించింది. మారుతి సుజుకిలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి కారు ఇదే కావడం విశేషం. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, మారుతీ జెడ్‌ సిరీస్‌ 1.2 లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మాన్యువల్‌ వేరియంట్‌లో లీటర్‌కు 24.79 కిలోమీటర్ల మైలేజీ, ఎఎంటి వేరియంట్‌ లీటర్‌కు 25.71 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.