న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా దేశంలో తయారు చేసిన ఐదు డోర్ల జిమ్నీ వాహనాలను ఎగుమ తి చేస్తున్నట్లు తెలిపింది. గూర్‌గావ్‌లో తయారు చేసిన ఈ ఎస్‌యువి జపాన్ లో ఆవిష్కరించిన ట్లు గురువా రం వెల్ల డించింది. ఈ మేడ్ ఇన్ ఇండియా వాహనాన్ని గ్లోబల్ స్థాయిలో రూపొం దించినట్లు మారుతి సుజుకి ఇండియా ఎండి, సిఇఒ హిసషి టెకుచి తెలిపారు. కాగా.. భారత్ నుంచి జపాన్‌కు ఎగుమతి చేస్తున్న వాటిలో ఇది రెండో మోడల్ కావడం విశేషం. 2024 ఆగస్టులో ఫ్రాంక్స్‌ను ఎగుమతి చేసింది.