న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఉత్పత్తి భారీగా పడిపోయింది. పండుగ సీజన్‌లోనూ డిమాండ్ లేమితో అక్టోబర్‌లో ఆ కంపెనీ ఉత్పత్తిని 16 శాతం తగ్గించుకుంది. దీంతో గడిచిన నెలలో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 89,174 యూనిట్లకు పడిపోయింది. గతేడాది ఇదే నెలలో 1,06,190 యూనిట్లను తయారు చేసింది.
మారుతి కొత్త డిజైర్‌కు బుకింగ్స్ షురూ..
మారుతి సుజుకి తన కొత్తగా నాలుగో జనరేషన్ డిజైర్ డిజైర్‌కు బుకింగ్స్‌ను తెరుస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 11 నుంచి ఈ కారును రూ.11,000తో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. మారుతి టాప్ 10 అమ్మకాల్లో డిజైర్ ఒక్కటిగా ఉంది. 1.2 లీటర్ త్రి సిలిండర్ పెట్రోల్ ఇంజీన్ కలిగి ఉంది. ఇందులో సిఎన్‌జి వేరియంట్‌ను తెచ్చే యోచనలోనూ ఆ కంపెనీ ఉంది.