మార్క్సిస్టులే మార్గ నిర్దేశకులు

ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని రూపుదిద్దడంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిది. ఖమ్మం మున్సిపల్‌ చైర్మెన్‌గా 3ఖమ్మం జిల్లా ప్రగతికి కమ్యూనిస్టులే మూలం.. భద్రాద్రి కరకట్టల నిర్మాణానికీ వారిది అలుపెరుగని పోరాటం.. పేర్లు, డిజైన్లు మారినా ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి కష్టాలు తీర్చాలనే తలంపు.. నాగార్జున సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ నేడు ‘సీతారామ’ అనిపించు కుంటున్నా.. నాడు ‘దుమ్ముగూడెం’ ప్రాజెక్టు బీజం.. అడవి బిడ్డల కోసం ఆరాటం.. తునికాకు పోరాటాలు, 1/70 చట్టాలు, పోడు పట్టాలు.. ‘మిషన్‌ భగీరథ’ కంటే 30 ఏండ్ల ముందే మార్క్సిస్టులు తెచ్చిన ‘బోడేపూడి సుజల స్రవంతి పథకం’.. ఇలా ఒక్కటా రెండా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అనేకం.. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్న కారణంగా ప్రజలకు అందిన ప్రతిఫలాలు. అందుకే కమ్యూనిస్టులు లేని చట్టసభలు దేవుడు లేని దేవాలయాలయ్యాయి.
– ప్రగతి సాధనలో ఎప్పుడూ ఆదర్శమే..!
– ‘దుమ్ముగూడెం’ నీటి కోసం ప్రజా ఉద్యమం
– సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు బీజం
– బోడేపూడి సుజల స్రవంతితో తీరిన దాహం అడవిబిడ్డల కోసం ఆరాటం.. కులవివక్షపై పోరాటం చట్టసభల్లో ప్రజావాణి వినిపించేది కమ్యూనిస్టులే
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని రూపుదిద్దడంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిది. ఖమ్మం మున్సిపల్‌ చైర్మెన్‌గా 30 ఏండ్లపాటు పనిచేసిన చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, ఆ తర్వాత అఫ్రోజ్‌సమీనా హయాంలో నగరం అభివృద్ధి బాటలో పయనించింది. ఖమ్మం టూటౌన్‌ ప్రాంత అభివృద్ధిలో నాడు ఖానాపురం పంచాయతీ సర్పంచ్‌గా బుగ్గవీటి సరళ ప్రశంసలు అందుకున్నారు. 2004లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన, ప్రస్తుత పాలేరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అంతకుముందు మంచికంటి రాంకిషన్‌రావు, సీపీఐ నాయకులు నల్లమల గిరిప్రసాద్‌, మహ్మద్‌ రజబ అలీ, పువ్వాడ నాగేశ్వరరావు ఎమ్మెల్యే లుగా ఖమ్మానికి ఓ రూపం తీసు కొచ్చారు. నేడు ఆ మూలాల ఆధారం గానే ఏ అభివృద్ధి అయినా కొనసాగు తోంది. చివరి మజిలీ కాల్వొడ్డు వైకుంఠధా మానికి సైతం తమ్మినేని ఎంపీగా ఉన్నప్పుడే ఓ రూపం వచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ తరలకుండా కమ్యూనిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారు.
దుమ్ముగూడెం టూ సీతారామ
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నేడు నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం కమ్యూనిస్టుల పోరాట ఫలితం. 2004లో తమ్మినేని వీరభద్రం ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం 2,662 కి.మీటర్ల, వంద రోజులపాటు పాదయాత్ర చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై చట్టసభల్లో ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా వైఎస్‌ఆర్‌ దుమ్ముగూడెం నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత నిధుల కేటాయింపుల్లో జాప్యం చోటుచేసు కోవడంతో తమ్మినేని అసెంబ్లీలో గళం విప్పారు. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత డిజైన్లు, పేర్లు మారుతూ ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకంగా రూపుదిద్దుకుంది. కృష్ణా గోదావరి జలాల అనుసంధానంతో సాగర్‌ జలాల స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకానికి మూలం సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో చేసిన పోరాటాలే..
అడవి బిడ్డల కోసం చట్టసభల్లో గళం
అడవి బిడ్డల కోసం పోరాటం సాగించటంతోపాటు చట్టసభల్లో గళం విప్పడం ద్వారా సీపీఐ(ఎం)కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యతో పాటు సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథాకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రధాన భూమిక వహించి గిరిజనాభివృద్ధికి కృషి చేశారు. 1996లో ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి ఎన్నికైన తమ్మినేని వీరభద్రం, రాజ్యసభ్యులు వై.రాధాకృష్ణమూర్తి, ఆ తర్వాత 2004లో పార్లమెంట్‌కు ఎన్నికైన సీపీఐ(ఎం) నేత మిడియం బాబూరావు తునికాకు ధర, గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యం, గిరిజనుల హక్కులు, అడవి బిడ్డల హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. ఫలితంగానే 1/70, వాల్టా, పీసా వంటి చట్టాలు, జీవో 4 వంటివెన్నో వెలుగులోకి వచ్చి అడవిబిడ్డలకు ఉద్యోగ నియామకాల్లో సముచిత ప్రాధాన్యం లభిస్తోంది. వైఎస్‌ఆర్‌ హయాంలో పోడు హక్కు పట్టాలు సైతం ఇప్పించారు. ఇల్లెందు, బూర్గంపాడు (నేడు పినపాక), భద్రాచలం, ఇటు వైరా తదితర ఎస్టీ నియోజకవర్గాల్లో ఈ రోజు అడవిబిడ్డలు అంతోఇంతో స్వేచ్ఛాగాలులు పీల్చుతున్నారంటే చట్టసభల్లో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీల పోరాట ఫలితమే. నేడు చట్టసభల్లో లేనప్పటికీ కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చి 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇప్పించడంలోనూ కమ్యూనిస్టులే కీలక భూమిక పోషించారనే విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రగతి ధార కొనసాగాలంటే కమ్యూనిస్టులను చట్టసభలకు పంపాలి.
సామాజిక తెలంగాణ కోసం
కుల, మత అంతరాలులేని సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తున్నారు. తెలంగాణ తొలి శాసనసభలో సున్నం రాజయ్య వంటి కమ్యూనిస్టు యోధుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం కోసం 2016లో 9 మంది సభ్యులతో దాదాపు ఐదునెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహాజన పాదయాత్ర చేపట్టారు. సామాజిక న్యాయం కోసం రాజయ్య అసెంబ్లీలో గళం విప్పారు. 2018 తర్వాత ఒక్క కమ్యూనిస్టు సభ్యుడు కూడా శాసనసభలో లేని ఫలితంగా పీడిత తాడిత ప్రజల పక్షాన గళం విప్పేవారే కరువయ్యారు. అందుకే కమ్యూనిస్టులను ప్రజల పక్షాన చట్టసభలకు పంపించాలి.
బోడేపూడి సుజల స్రవంతి
తాగునీటి అవసరాల కోసం నేటి ప్రభుత్వం రూ.4వేల కోట్లకు పైగా ఖర్చు చేసి చేపట్టిన మిషన్‌ భగీరథ కంటే ముందే సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు ముందుచూపుతో వ్యవహరించారు. మధిర, వైరా నియోజకవర్గాల్లోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాటి మధిర ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 1993లోనే వైరా రిజర్వాయర్‌ ఆధారంగా సమగ్రమైన ప్రణాళికతో మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. అకుంఠిత దీక్షతో పోరాడి సాధించారు. అందుకే ప్రభుత్వ ప్రభుత్వమే స్వయంగా ఈ పథకానికి ”బోడేపూడి సుజల స్రవంతి”గా నామకరణం చేసింది. నేటికీ ఈ నియోజకవర్గాల్లోని వందకు పైగా గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడంలో ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. సాగర్‌ జలాలు చివరి భూములకు చేర్చడంలోనూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు బోడేపూడి వెంకటేశ్వర రావు, కట్టా వెంకటనర్సయ్య కృషి అనిర్వచనీయం.