
హైదరాబాద్ జిల్లాలో ఈనెల 19,20 తేదిలలో జరగబోయే తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్యాల విద్యార్థిని దారావత్ దీపిక ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పగిడిపల్లి నిర్మలాజ్యోతి బుధవారం తెలియజేశారు.ఈనెల 14 న జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో నిర్వహించిన జిల్లా స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్ లో 14 సంవత్సరాల లోపు బాలికల ట్రైయాత్లేన్ గ్రూప్-బి విభాగం లో ప్రథమ స్థానం లో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేశారు.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన దారావత్ దీపిక కు ప్రశంస పత్రము మెడల్ ను బహుకరించిన ప్రధానోపాధ్యాయులు పగిడిపల్లి. నిర్మలాజ్యోతి అభినందించారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయబృందం శ్రీకాంత్, స్వరూప రాణి, సిద్దులు,రాజు, ముఖిద్, రవీశ్వర్, సుజాత, శ్రీధర్, నాగజ్యోతి, శ్రీదేవి, గోపాల్, సుష్మ తదితరులు పాల్గొన్నారు.