ఏనుగు శ్రీకాంత్ రెడ్డికి మేరిల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్..

Maryland State University Honorary Doctorate Awarded to Enugu Srikanth Reddy..నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రస్తుత రీజియన్ చైర్పర్సన్ స్లేట్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఏనుగు  శ్రీకాంత్ రెడ్డి మేరిల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ, USA ద్వారా గౌరవ డాక్టరేట్ (Ph.D.) బిజినెస్ మేనేజ్‌మెంట్ & సోషల్ వర్క్ లో స్వర్ణ పతకంతో అందుకున్నారు. ఈ గౌరవం ఆయన విద్య, సామాజిక సేవ,  యువత అభివృద్ధి కోసం చేసిన విశేష కృషికి గుర్తింపు. ఆయన పిల్లలు, యువతకు విలువలు నేర్పడం, మంచినడవడిని అలవాటు చేయడం ద్వారా సమాజం మీద తనదైన ముద్ర వేశారు. అంతేకాక, సాధన, సంస్కారం పేరిట ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,  నిర్వహణాధికారులకు తెలంగాణ వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సమాజాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారు. ఈ గౌరవ డాక్టరేట్ జనవరి 5, 2025 న ఇండియా హాబిటాట్ సెంటర్, లోధి రోడ్, న్యూ ఢిల్లీ లో జరిగిన కాన్వొకేషన్‌లో చీఫ్ గెస్ట్ జస్టిస్ జేడు ఖాన్, ఫార్మర్ జడ్జ్, అలహాబాద్ చేతుల మీద తీసుకున్నారు. ఈ సందర్భంగా లయన్ శ్రీకాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, “ఈ గౌరవం నన్ను సమాజానికి మరింత సేవ చేయడానికి, యువతలో విలువలు పెంచేందుకు, మరియు మెరుగైన భవిష్యత్తు నిర్మించేందుకు ప్రేరేపిస్తోంది.” అని అన్నారు.