రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మాసాయిపేట విద్యార్థిని ఎంపిక

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ 
68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఆలేరు లో జరిగినటువంటి కబడ్డీ పోటీలు, ఎంపికలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాయిపేటకు చెందిన వల్లపు ఇందు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 7, 8,9 తేదీలలో మాదాపూర్ గ్రామం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి 68వ కబడ్డి పోటీలలో అండర్ 14 బాలికల విభాగంలో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మల్లికార్జున, వ్యాయామ ఉపాధ్యాయులు టి.చంద్రశేఖర్, ఉపాధ్యాయ బృందం  ఇందును అభినందించారు.