
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మెరకు ఇటీవల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే.దీంతో మండలంలోని గ్రామాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలలు కనిపించకుండా తెల్లని వస్ర్తాలు తొడిగారు. శిలపలకలు కనిపించకుండా వైట్ పేపర్ అంటించారు.ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారుల ఆదేశాలతో తెల్లని వస్ర్తాలు, వైట్ పేపర్లు తొలగించనున్నారు.ఎన్నికల ప్రవార్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ కోరారు.