బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్, నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఓ స్ట్రెయిట్ హిందీ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.
సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. మాస్ ఫీస్ట్ లోడింగ్ అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్, డీవోపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్, డైలాగ్స్: సౌరభ్ గుప్తా.