మాస్‌ ఎంటర్‌టైనర్‌

Mass entertainer ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను శనివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. నిర్మాత డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘సినిమా ఈ స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. వెంకట్‌, శ్రీహరి, సలోని, హెబ్బాపటేల్‌ నటించారు. పాటలకు జిన్నా సంగీతం అద్భుతంగా సమకూర్చారు. లేటెస్ట్‌గా రిలీజైన గ్లింప్స్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘నిర్మాత డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డికి థ్యాంక్స్‌. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్‌తో ఐదేళ్ళ జర్నీ ఉంది. లవర్‌ బారుగా చేసిన ఆయన ఇందులో మాస్‌ హీరోగా చేశారు. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్‌ మారుతీతోపాటు అందరి సహకారంతో అవుట్‌ఫుట్‌ అత్యద్భుతంగా వచ్చింది’ అని దర్శకుడు రాజ్‌ తాళ్ళూరి చెప్పారు. హీరో వెంకట్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం కమర్షియల్‌ ఎలిమెంట్‌తో మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ 60 శాతం పూర్తయ్యింది. వచ్చే నెలలో సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు.