మామిడిపల్లి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల యందు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినారు. ప్రాధనోపాధ్యాయురాలు అనసూయ సరస్వతి పూజ నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడి టీచర్లు లక్ష్ , సంగీత, గోదావరి, రజిని తదితరులు పాల్గొన్నారు.