
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పసర మేడారం లింగాల తాడువాయి రేంజిల పరిధిలో మాస్ ప్లాంటింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ముందుగా పసర రేంజ్ కార్యాలయం నుండి విద్యార్థులతో నాలుగు రేంజీలకు సంబంధించిన అటవీ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు నాటడం అనే కార్యక్రమం పై అవగాహన కల్పించారు. కొత్త నాగారం నర్సరీ నుండి మాస్ ప్లాంటింగ్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసర రేంజ్ అధికారి మాధవి శీతల్ మేడారం రేంజ్ అధికారి ఎల్లయ్య లింగాల తాడువాయి రేంజ్ అధికారి కోటి సత్తయ్య లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.