రామారెడ్డి బాలుర పాఠశాలలో మాస్ పోలింగ్

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శుక్రవారం మాస్ పోలింగ్ ను ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ… విద్యార్థులకు ఎన్నికలు, ఓట్ల విలువపై అవగాహన కల్పించడానికి మాస్ పోలింగ్ నిర్వహించామని, 77.7% విద్యార్థులు పోలింగ్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.