భారతీయ బీజేపీ పార్టీ చండూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన ముఖ్య నాయకులు కౌన్సిలర్ గుంటి వెంకటేశం, జిల్లా నాయకులు కొత్తపాటి సతీష్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి పార్టీ పదవులకు క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకీ ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిబద్దతతో పార్టీ కోసం పనిచేశామని, కానీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండా పూర్తిగా కాంగ్రెస్ భావజాలంతో నిండిన వ్యక్తులను తీసుకొచ్చి వారికోసం పనిచేయాలంటే మనస్ఫూర్తిగా పనిచేయలేక తప్పుకుంటున్నామన్నారు. గతేడాది అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మోసం చేసి పోయినా, తిరిగి కాంగ్రెస్ ఫిరాయింపు దారునికి భీ ఫాం ప్రకటించడంబీజేపీ సిద్దాంతాలు విస్మరించడమేనని వారన్నారు. ఇన్నాళ్లు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమవెంట జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు వెంకట్ రెడ్డి, కోశాధికారి కొత్త అంజిబాబు, మున్సిపల్ పార్టీ కార్యదర్శి రాపోలు జగదీష్, ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపోలు వెంకటేశం, ఇడికోజు నాగరాజు, బూత్ అధ్యక్షులు రావిరాల భార్గవ్, యస్ సి మోర్చా నాయకులు బుషిపాక నగేష్ తదితరులు పార్టీలో చేరారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.