నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలంలోని కొత్తలూరు,తమడపల్లి పోతునూరు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్లపల్లి నర్సిరెడ్డి, రేపాకుల సాయికుమార్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ కుందూరు జయవీర్రెడ్డి మాజీ జిల్లా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, అనుముల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరారు.ఈకార్యక్రమంలో తెలపాటి మహేందర్ నాథ్, దున్న ఏడుకొండలు, దున్న అరుణ్, దున్న వినోద్ కుమార్,తరి నరేష్, బొడ్డు వేణు, బొడ్డు వెంకటేష్, సింగం మహేష్, గార్లపాటి మధు, తెలపాటి మధు, రెడ్డి శ్రీనివాసులు, ఎలిజాల సాయి,చింతల వెంకటేశ్వర్లు,రామాచారి భూతరాజు అక్కులు, మేడారం యాదగిరి, మేడారం అంజి, నెర్మటి కోటిరెడ్డి, వడ్లపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.