కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

నవతెలంగాణ-అర్వపల్లి
మండల కేంద్రంలోని జాజిరెడ్డిగూడెం ఇతర గ్రామాల నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ధరూర్‌ యోగానంద చర్యలు సమక్షంలో బుధవారం బి ఆర్‌ఎస్‌ వివిధ పార్టీల చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు 200 మందికి పైగా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ధరూర్‌ యోగానందచార్యులు పార్టీ కండువాలను కఫీ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మామిడి సత్యనారాయణ తాటిపాముల జలంధర్‌ రాజు మామిడి విజరు పలస నరసయ్య మురళి కోటమర సత్తయ్య అంజయ్య కుంభం యాగయ్య వాళ్ళ సైదులు తాడూరి నాగయ్య ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మీరెడ్డి రాజేందర్‌రెడ్డి ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్‌ గౌడ్‌ మోరపాక సత్యం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.