నవతెలంగాణ- తాడ్వాయి : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం సాయంత్రం తాడ్వాయి మండల కేంద్రంలో ఇందిరానగర్, నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్ బిజెపి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బంగారు సాంబయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన గంట మనోజ్ రెడ్డి, గట్టు వంశీ, చీమల శ్రావణ్ కుమార్, తాటి దిలీప్, పోలుదాసరి రంజిత్, తుమ్మల రాజేందర్, నవీన్, దాగం నిఖిల్ లకు, బిఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో ములుగు నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆమె గుర్తు చేశారు. దేశంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చల్ల రజనీకర్ రెడ్డి, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, మాజీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ కొర్నెబెల్లి శివయ్య, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.