నవతెలంగాణ- హుస్నాబాద్ : హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీలోకి వివిధ గ్రామాల నుండి ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో భారీగా చేరికలు అవుతున్నాయి. సోమవారం బీఆర్ఎస్ హుస్నాబాద్ పార్టీ కార్యాలయం జనగాం గ్రామం నుండి 70 మంది యువకులు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిరోజు వివిధ పార్టీల నుండి యువకులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. పార్టీలో చేరుతున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో అందరికీ సమున్నత స్థానం కల్పిస్తామని సతీష్ కుమార్ తెలిపారు.