నవతెలంగాణ- వలిగొండ రూరల్: భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో కాంగ్రెస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు ఉక్కుర్తి యాదయ్య, సీనియర్ నాయకులు కంచర్ల మధుసూదన్ రెడ్డి, మల్లం లక్ష్మయ్య, ఉక్కుర్తి శ్రీను, తోపాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసల అన్న మేరి శౌరి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కలుకూరి రాములు, కొలుపుల అమరేందర్, ముద్దసాని కిరణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు