కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు సుమారు 30 మంది ఆదివారం మాజీమంత్రి షబ్బీర్ అలీ వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, రానున్న ఎన్నికల కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి దేవరాజ్ గౌడ్, ఎన్నారై జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.