బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

– సుద్ధపల్లి గ్రామానికి చెందిన బిజెపి  నుండి బీఆర్‌ఎస్‌లోకి..
– కండువా కప్పిన ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం డిచ్ పల్లి మండలం లోని సుద్ధపల్లి గ్రామానికి చెందిన బిజెపి నుండి బీఆర్‌ఎస్‌లో పార్టీలో భారీగా చేరిన  బిజెపి నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు చేసింది ఏమీ లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రూరల్ నియోజకవర్గం మంజూరు చేస్తూ జిల్లాలోని నెంబర్ వన్ నియోజకవర్గం గా చేయడానికి కృషి చేస్తున్నారన్నారు రాబోవు రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఈ విషయాన్ని నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు.బీఆర్ఎస్ లో చేరిన వారిలో ప్రభాకర్ రెడ్డి, ఆర్ గంగాధర్, జి గంగ సాయిలు, ఎల్ రమణ చారి, రవీందర్, రాములు, నందు, సాకలి దాసు, బాబురావు, సురేందర్, లింగయ్య, సంజు, రాము,చింతల భూమేష్,అశోక్, మహేందర్, సతీష్, నరేందర్, తోపాటు తదితరులు చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ రెడ్డి, సుద్ధపల్లి గ్రామ విడిసి సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.