బీఆర్ఎస్ లో  భారీగా చేరికలు..

 – కండువాలు వేసిన బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: డిచ్ పల్లి మాజీ జడ్పీటీసీ ధరంపురి కుమారుడు శక్కరికొండ సాగర్, కోరట్ పల్లి తండా ఉపసర్పంచ్ పల్లపు భూమన్న (కాంగ్రెస్)తో పాటు వార్డు సభ్యులు, ఆయా పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు బుధవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరూ కలిసికట్టుగా ఉండి గెలుపు లక్ష్యంగా పని చేయాలని, ప్రతి ఇంటికి గడపగడపకు వెళ్లి, ప్రస్తుతం అధికారంలోకి చేపట్టాల్సిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అంతకుముందు శక్కరికొండ సాగర్ బాజిరెడ్డి గోవర్ధన్కు ప్రచారం నిమిత్తం 50 వేల నగదును ప్రచారం నిమిత్తం అందజేశారు. బాజిరెడ్డి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ ఇన్చార్జి వీజీగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి,  కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు, సర్పంచ్ పత్తి మమత అనంద్, బీఆర్ఎస్ నాయకులు తలారి సాయన్న, ఇర్ఫాన్ , బాబా,శక్కరికొండ కృష్ణ, ఎడవెల్లి సోంనాథ్, నవీన్రెడ్డి, లక్ష్మీనారాయణ, పద్మరావు, నల్లవెల్లి సాయిలు, ఆనంద్, నిమ్మగడ్డ రాజా తదితరులున్నారు.
ఇందల్ వాయి లో..
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో యువ చైతన్య యువత అధ్యక్షులు గంగిరెడ్డి రవి, మున్నూరు కాపు యూత్ అధ్యక్షులు అశోక్, స్పోర్ట్స్ అధ్యక్షులు కన్నయ్య గౌడ్ తో పాటు పలు తండాలకు, గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు దాదాపు 200 మంది యువత బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో గులాబి తీర్థం పుచ్చుకున్నారు.చేరిన వారందరి బీఆర్ఎస్ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ రూరల్ ఇంచార్జీ వి గంగాధర్ గౌడ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి దాస్, రూరల్ కన్వీనర్ పాశం కుమార్, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, ఉప సర్పంచ్ రాజేందర్,

నాగరాజ్, ప్రశాంత్, రాము, మహిపాల్, అశోక్, రఘుపతి రెడ్డి, రవి, నరేష్, భూమయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.