ఆలూరు మండల కేంద్రం నుండి బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

నవతెలంగాణ -ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రం నుండి వివిధ పార్టీకి చెందిన యూత్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. చేరిన వారిలో నవీన్ నాగుర్ల (బీఎస్పీ),జాన్ బంజా (బిజెపి), కొత్తూరు సందీప్ (కాంగ్రెస్) మరియు వారి అనుచరులు పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.