గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై-గోరఖ్‌పూర్ వెళ్లున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైలు లగేజీ కంపార్టుమెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాసిక్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు రైలు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. అయితే రెండు బోగీలను తొలగించిన వెంటనే రైలు యథావిధిగా గోరఖ్‌పూర్‌కు బయల్దేరి వెళ్లిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.