వివిధ పార్టీల నుండి ఏఐఎఫ్‌బీలో భారీ చేరికలు

నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిల్లి రామరాజుయాదవ్‌ గెలుపును కోరుతూ కనగల్‌ మండలం యం.గౌరారం గ్రామానికి చెందిన సుమారు 200 మంది తమ పార్టీలను విడిచి పిల్లి కష్ణంరాజు అధ్వర్యంలో ఏఐఎఫ్‌బీలో చేరారు.ఈ సందర్భంగా కష్ణం రాజు వారికి శాలువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.