నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ టిడిపికి రాజీనామా చేసి వారి అనుచర వర్గంతో ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక క్యాప్ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం బిఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నాయకులు పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి ఆముడు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం తమ పదవి కాలంలో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఆయనతోపాటు కాంగ్రెస్లో చేరిన వారు టిడిపి భువనగిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావు , వివిధ మండలాల మండల గ్రామ నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారా బోయిన రవి ముదిరాజ్, కాంగ్రెస్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద లింగ యాదవ్, మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.