కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

నవతెలంగాణ – గోదావరిఖని
పాలకుర్తి మండల పరిధిలోని రాణపూర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ కి చెందిన బయ్యపు కమలాకర్ రెడ్డి, జాజిమొగ్గుల తిరుపతి, కోడూరి వెంకటేష్, ఇటవేణి కొమరయ్య, పర్లపెల్లి వంశీ, దురశెట్టి మారిన్, నాగుల సతీష్ గౌడ్, సంటి తిరుమల డిసీసీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ కేశోరాం కాంటాక్ట్ యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఏఐసీసీ సెక్రటరీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, బామ్లనాయక్ తండా మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, రాణాపూర్ మాజీ సర్పంచ్ బాలసాని కుమార్ గౌడ్, కన్నాల గ్రామశాఖ అధ్యక్షుడు బుతగడ్డల రమేష్, వేల్పుల రాజ్ కుమార్, సంపంగి కుమార్ మరియు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు