బీఎస్పీలోకి భారీగా ప్రముఖుల చేరికలు

– కౌన్సిలర్లు గండూరి పావని కపాకర్‌,గండూరి రాధిక రమేశ్‌ చేరిక
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
బహుజన వాదాన్ని బలపరచడం కోసం సూర్యాపేట పట్టణంలోని 45 వార్డు కౌన్సిలర్‌ గండూరి పావని కపాకర్‌, 38వ వార్డు కౌన్సిలర్‌ గండూరి రాధిక రమేష్‌ లతోపాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి ఆదివారం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్‌ పావని కపాకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీలో ఉండలేక బీఎస్పీలో చేరుతున్నట్టు తెలిపారు.ప్రజా బలం లేని వారికి పదవులు అంటగడుతూ ప్రజా బలం ఉన్న మాకు అవకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన అందరు కూడా ఏకమై జానన్నకు మద్దతు తెలపాలని కోరారు. ఒక మహిళను జడ్పిటిసి ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం లేని చోట ఉండలేకనే బిఎస్పి పార్టీలో చేరుతున్నారు తెలిపారు.అనంతరం గండూరి రాధిక రమేష్‌ మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి గౌరవ ఇవ్వకుండా అగౌరవపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ పేరు చెప్పుకునే మంత్రి జగదీశ్‌రెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం చెయ్యి విరిగితే ఇప్పటివరకు కూడా మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు.పార్టీ కోసం పని చేసిన తనను కాదని కౌన్సిలర్‌ టికెట్‌ వేరే ఇచ్చాడని, నా ఓటమి కోసం గడప గడప తిరిగిన జగదీష్‌ రెడ్డిని ఎవరు నమ్మక నా వెంటే జనం ఉన్నారని అన్నారు.జగదీష్‌ రెడ్డి నియంత పాలన తట్టుకోలేక ప్రజలు సూర్యాపేట నుంచి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రలోభాలకు గురి చేసిన, భయభ్రాంతులకు గురి చేస్తున్న లెక్కచేయకుండా బహుజనవాదం బలోపేతం చేయడానికి కౌన్సిలర్లు బీఎస్పీ వైపు చూస్తున్నారన్నారు.జగదీష్‌ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోసం పోరాటం చేసిన వారికి కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కౌన్సిల్లో ప్రశ్నించినందుకుగాను పలువురుకి టికెట్‌ ఇవ్వకుండా అణగదొక్కుతు ప్రయత్నం చేశాడని అన్నారు.జగదీశ్‌ రెడ్డి మొదటిసారి పోటీ చేసినప్పుడు కనీసం ఖర్చులకు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం అందజేసి గెలిపించుకున్న సంఘటన మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులని జగదీష్‌ రెడ్డి పప్పులు ఉడకపోవని ఇకనుంచి తరిమి పంపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కోట్ల రూపాయలు మంత్రి దగ్గరుంటే కోట్ల మంది బహుజనులు నా వెంట ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముందు45, 38 వార్డు కౌన్సిలర్లతోపాటు వ్యాపారవేత్త బొమ్మగాని సైదులు గౌడ్‌, చివ్వెంల మండలం వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షులు నెమ్మాది మల్సూర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు.బీజేపీ ఉపాధ్యక్షులు కోదాటి విజయకుమార్‌,పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.రాయినిగూడెం మాజీ సర్పంచ్‌ముత్యాల సైదులు, చివ్వెంల మాజీ ఎంపీపీ కుమారుడు ఇట్టిమల్ల స్టాలిన్‌, చింతల సురేష్‌, బిల్డర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, యువజన సంఘం నాయకులు గంపల రవిచంద్ర, ఇట్టిమల్ల విక్రం, హేమంత్‌ తదితరులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బిఎస్సి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి వట్టె రేణుక యాదవ్‌, 6వ వార్డు కౌన్సిలర్‌ ధరావత్‌ నీలాబాయి లింగానాయక్‌, సర్పంచులు కేశబోయిన మల్లయ్య, బోడబట్ల కవిత శ్రీను, ఎంపీటీసీ ఇందిర, నాయకులు చాంద్‌ పాషా, మీర్‌ అక్బర్‌, ఆవుల అంజయ్య, బెల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.