సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో భారీ కవాతు

– సమాస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
శాంతియుతంగా సహకరించాలి
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండాలో కేంద్ర సాయుధ బాలాగాలు, పోలీసు సిబ్బంది తో పెద్దవూర ఎస్ఐ అజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ కవాతు నిర్వహించారు. ఈసందర్బంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ మండలం లో తుంగతుర్తి, గేమ్యానాయక్ తండా వెల్మగూడెం, బసిరెడ్డి పల్లి చలకుర్తి, గ్రామాల్లో కూడా కేంద్ర బాలగాల సహకారంతో కవాతు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రజలు స్వచ్చాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించు కునేలా కవాతు నిర్వహింస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కేంద్ర సి ఆర్ పి ఎఫ్ బాలగాలు వున్నారు.